
బహదూర్‌పురా: ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరిని ఫాలో అవ్వొద్దంటూ స్నేహితుడికి చెప్పినా వినకపోవడంతో అతడిపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌కు చెందిన ఫసీఖాన్ సోదరిని ఫతే దజ్వారాకు చెందిన డిగ్రీ విద్యార్థి జమాన్ ఖాన్(19) గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడు. అమెను అనుసరించవద్దంటూ ఫసీఖాన్ బుధవారం రాత్రి జమాన్‌ఖాన్‌ను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఫసీఖాన్‌పై జమాన్‌ఖాన్ స్నేహితులు మూకుమ్మడిగా దాడి చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా.. విద్యార్థులంతా పారిపోయారు. ఫసీఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం పాతబస్తీలోని మలక్‌పేట్, కాలాపత్తర్‌కు చెందిన షకీల్ అదానీ(18), షేక్ అఫ్సాన్ అలీ(18), మన్సూర్ అలీ(17), మహ్మద్ ఫజల్ (18)ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment