
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ చేపల మార్కెట్‌లో ఉన్న ఆయనను కత్తితో పొడిచి పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో సైనేడ్ పూసిన కత్తితో భాస్కర్ రావును హత్య చేశారు. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ఇద్దరూ టీడీపీ మాజీ కౌన్సిలర్ అనుచరులుగా అనుమానం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment