
పొట్ట లో దిగిన బల్లెం
కొత్తూరు: వైఎస్సార్‌సీపీ అభిమాని కామక జంగం(60)ను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి.. కర్రలతో దాడిచేయడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మండలంలోని కుంటిబద్ర కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న నిందితులు అగతమూడి బైరాగి నాయుడు, టి.జగదీష్, కొవ్వాడ రాజు, కె.ఎర్రయ్య, కె.జమ్మయ్య, పి.మన్మదరావు, కె.తిరుపతి రావును కొత్తూరు పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అరుణ్‌కుమార్ పరారీలో ఉన్నాడు.
(చదవండి : వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హతమార్చిన టీడీపీ వర్గీయులు)
వివరాలు.. కుంటిభద్ర కాలనీకి చెందిన కామక జంగం వైఎస్సాసీపీ అభిమాని. ఆయనతోపాటు అన్నదమ్ములు, వారి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అదే కాలనికి చెందిన కొవ్వాడ రాజు, ఎర్రయ్యలు చెప్పారు. జంగంతోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి తాము వైఎస్సార్‌సీపీ వెంట ఉంటామని తెలియజేశారు. మాట వినలేదని కొవ్వాడ రాజు అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. చిన్న, చిన్న విషయాలకు తగాదాలకు దిగేవాడు.
జంగంకు చెందిన గడ్డివాము (కల్లంలో) దగ్గర పుట్టగొడుగులు మొలిశాయి. పుట్టగొడుగులు ఎందుకు తీశారని కొవ్వాడ రాజుతోపాటు ఆయన అన్నదమ్ములను జంగం నిలదీశారు. అప్పటికే కొట్లాటకు సిద్ధంగా ఉన్న కొవ్వాడ రాజు తన వద్ద ఉన్న బరిసె(బల్లెం)తో జంగం పొట్టపై పొడిచాడు. అక్కడే ఉన్న కొవ్వాడ ఎర్రయ్య, జమ్మయ్య, తిరుపతిరావు కర్రలతో దాడి చేయడంతో జంగం అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. జంగంను తొలుత కొత్తూరు సీహెచ్‌సీకి, అక్కడ నుంచి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇక ఇదే ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment