
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోన వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. ఇప్పటికే 30 వేల కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీకి పెద్ద మొత్తంలో వైద్యులు, ఆస్పత్రి బెడ్లు అవసరమని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డబ్లింగ్ రేటు 12 నుంచి13 రోజులుగా ఉందని తెలిపారు. ఈ ప్రకారం ఢిల్లీలో జూన్ 30 నాటికి లక్ష కేసులు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. జులై 15 నాటికి 2 లక్షల కేసులు, జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.
అదేసందర్భంలో ఢిల్లీలో వైరస్ కమ్యునిటీ ట్రాన్స్‌ఫర్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఢిల్లీ వాసులకు మాత్రమే కోవిడ్ చికిత్స అందించాలని, వైరస్ లక్షణాలున్న వారికే నిర్ధారణ పరీక్షలు జరపాలని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలివ్వగా.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వాటిని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్థానికతతో సంబంధం లేకుండా కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించాలని ఎల్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
(చదవండి: జ్వరం, గొంతు నొప్పితో హోం ఐసోలేషన్‌లో కేజ్రీవాల్)
Comments
Please login to add a commentAdd a comment