వైఎస్ఆర్కు ఎన్నారైల ఘన నివాళి | Dr. YSR 's 6th Vardanthi events in us by nri ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్కు ఎన్నారైల ఘన నివాళి

Published Tue, Oct 6 2015 2:15 PM | Last Updated on Sat, Jul 7 2018 2:48 PM

వైఎస్ఆర్కు ఎన్నారైల ఘన నివాళి - Sakshi

వైఎస్ఆర్కు ఎన్నారైల ఘన నివాళి

ఎన్నారై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు పట్టణాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని  నిర్వహించారు. గత జూలైలో అట్లాంటాలో విజయవంతంగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించినట్లుగానే వర్థంతి వేడుకలు జరిపారు. దేశ వ్యాప్తంగా వైఎస్ మద్దతుదారులు ఈ కార్యక్రమంలో భారీఎత్తున పాల్గొన్నారు.  ముందుగా వైఎస్ఆర్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తధాన శిబిరాలతోపాటు పేదవారికి అన్నధాన కార్యక్రమం, పండ్లపంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.

ముఖ్యంగా డల్లాస్, మేరీలాండ్, ఫిలడెల్పియాలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, చలమలశెట్టి సునీల్, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.  వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్నారై వైఎస్ఆర్సీపీ  కమిటీ సభ్యులు వల్లూరి రమేశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్, కోర్ కమిటీ సభ్యులు మక్తాపురం కిరణ్, కాకుమాని ప్రసన్న, దేవపట్ల రామ్ గోపాల్, పోలం విజయ్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం విజయవంతమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement