డల్లాస్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్ :
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 68వ జయంతి వేడుకలు అమెరికాలో డల్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ధరణి సౌత్ ఇండియా క్యూసిన్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను రమణ్ రెడ్డి క్రిస్టపాటి సాధరంగా ఆహ్వానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగంలాంటిదని అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి వైఎస్ఆర్తో తనకున్న అనుభవాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్కున్న చరీష్మా మరే ఇతర నాయకులకు లేదన్నారు. అలాగే తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావిస్తూ ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రసంగించారు.
ప్రశాంత్ కిషోర్ రాకతో వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరిందని మహేష్ ఆదిభట్ల తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటనతో ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సమర శంఖం పూరించినట్లేనని పాలకపక్ష నేతల్లో హైరానా మొదలైందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించి తెలుగువారి సత్తాచాటాలని డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి పిలుపునిచ్చారు. అధికార తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలను ఖండించడానికి సోషల్ మీడియాను ఓ అస్త్రంగా వాడాలని మణి అన్నపురెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ అత్మచరణ్ రెడ్డి, డా. పవన్ పామదుర్తి, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, డల్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సుబ్బారెడ్డి కొండు, డా. పవన్ పామదుర్తి, రమణ పుట్లురు, శ్రీనివాస ఒబులారెడ్డి, మణి అన్నపురెడ్డి, డా. రామిరెడ్డి బుచ్చిపూడి, విశ్వంత్ కిచ్చిలి, రమణారెడ్డి క్రిస్టపాటి, మహేష్ ఆదిభట్ల, ఫాల్గున్ రెడ్డి, భీమా పెంట, నజీం షేక్, ప్రభంద్ రెడ్డి, చందు రెడ్డి, శివ నాగిరెడ్డి, జయ చంద్రారెడ్డి, రాజేంద్ర పోలు, తిరుమల కుంభం, ఉమా మహేష్ కుర్రి, రవి అరిమిండా, సతీష్ భండారులతో పాటూ పలురువు పాల్గొన్నారు.