న్యూలండన్లో మే 23 నుంచి సాయి పల్లకి ఉత్సవం
లండన్: ఈ ఏడాది షిర్డీ సాయి పల్లకీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు న్యూ ఇంగ్లాండ్ షిర్డీ సాయి దేవాలయం (ఎన్ఈఎస్ఎస్పీ) గురువారం లండన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ పల్లకీ వేడుకలు మే 23వ తేదీన ప్రారంభమై... జూలై 31తో ముగుస్తాయని తెలిపింది. కాగా ఈ ఏడాది పల్లకీ వేడుకల్లో ఓ ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొంది. సాయిబాబాకు ప్రత్యేక దేవాలయాన్ని మసాచూసెట్స్లోని గ్రోటన్లో 28 ఏకరాల సువిశాలమైన ప్రదేశంలో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పింది. అందుకోసం మే 24వ తేదీన భూమి శుద్దీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎన్ఈఎస్ఎస్పీ వివరించింది.
అందుకోసం ఇప్పటికే భారత్ నుంచి గంగా, గోదావరి నదల నుంచి నీటిని లండన్ తీసుకువచ్చినట్లు చెప్పింది. ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే అని ఎన్ఈఎస్ఎస్పీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎన్ఈఎస్ఎస్పీ స్థాపించి తొమ్మిదేళ్లు అయిందని తెలిపింది.
అలాగే లండన్లో చేపడతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంస్థ ఎలా బాగస్వామ్యం అవుతుంది విశదీకరించింది. గత తొమ్మిదేళ్లుగా ఎన్ఈఎస్ఎస్పీ స్థానికంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించింది. అలాగే లండన్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంస్థ ఎలా భాగస్వామ్యమైనది సోదాహరణలతో పేర్కొంది.