రాయదుర్గం అర్బన్ : జిల్లాలోని 12 ప్రాంతాల్లో రాత్రి బస షెల్టర్లు మంజూరు చేసినట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సావిత్రి తెలిపారు. శుక్రవారం రాయదుర్గం వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వీటిని జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం (మెప్మా)కింద తాము అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2015– 16 సంవత్సరానికి ఐదు షెల్టర్‌లు కేటాయించగా, వీటికి రూ. 11 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2016–17 సంవత్సరానికి ఏడు షెల్టర్‌లకు గాను ఒక్కొక్క దానికి రూ. 13 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు.
మంజూరు చేసిన మొత్తంలో రూ. 5లక్షలు ఏర్పాట్లకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు , రూ. 8లక్షలతో కేర్ టేకర్స్, భోజన సదుపాయాలకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కొక్క షెల్టర్‌లో 50 మందికి వసతి ఉంటుందన్నారు. ఈ ఏడాది మంజూరైన వాటిలో జిల్లాలో రాయదుర్గంలో ఒకటి, కదిరిలో ఒకటి, అనంతపురంలో మూడు షెల్టర్‌లు ప్రారంభమయ్యాయని, మడకశిరలో ఒకటి, అనంతపురంలో మరొక షెల్టర్ ప్రారంభం కావాల్సి ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, లీగల్ సర్వీసెస్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, బాగా నిర్వహించే వారికి రెండో ఏడాదిలో రూ.6లక్షల వరకూ మంజూరు అవుతుందని వివరించారు.
జిల్లాలో 12 రాత్రి బస షెల్టర్లు : మెప్మా పీడీ
Published Fri, Jul 14 2017 9:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement