విశాఖపట్నం జిల్లా పాడేరు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
పాడేరు : విశాఖపట్నం జిల్లా పాడేరు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో విశాఖపట్నం నుంచి ఔరంగాబాద్కు తరలిస్తున్న 49 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.