భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రగ్ మాఫియా వినూత్న మార్గాల్లో గంజాయి రవాణాకు పాల్పడుతోంది. బీరువాల తరలింపు మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఏపిలోని చింతూరు నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తుండగా గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ మాఫియాపై జిల్లా ఎస్పీ డా.వినీత్, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
డ్రగ్ మాఫియా ముఠా.. ప్రత్యేకంగా రూపొందించిన బీరువాల్లో గంజాయి పేర్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని తెలిపారు. రూ. 30లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారని అన్నారు. ఈ మఠాలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసుపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గంజాయిని అమ్ముతున్న ఏడుగురు యువకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యువకుల నుంచి 7 గంజాయి ప్యాకెట్లు, మూడు ఆటోలు,సెల్‌ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకుట్లు పోలీసులు తెలిపారు. యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సదాశివపేట పోలీసులు పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో తొలిసారి కొకైన్ లభ్యం..
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్ ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. డిచ్‌పల్లి మండలం నడిపల్లి వద్ద ఢిల్లీ నుంచి వచ్చిన స్కోడా కారులో కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇద్దరు యువకులు ఢిల్లీ వ్యక్తి రాహుల్ ద్వారా తెచ్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment