26న చైర్మన్‌ పదవికి రాజీనామా | 26th resign of chairman says chaman | Sakshi
Sakshi News home page

26న చైర్మన్‌ పదవికి రాజీనామా

Published Fri, Jul 21 2017 10:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

26th resign of chairman says chaman

అనంతపురం సిటీ: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి ఈనెల 26న రాజీనామా చేయనున్నట్లు చమన్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేస్తానన్నారు. చైర్మన్‌గా మూడేళ్ల పాటు క్రమశిక్షణతో పని చేశానన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు.

చాలా పనులు పెండింగ్‌లో పడనుండటంతో వాటిని పూర్తి చేసే ఉద్దేశంతోనే గడువు పొడిగించుకున్నానే తప్ప స్వార్థంతో కాదన్నారు. తాజాగా ఎంపీడీఓలకు ఆర్డర్‌ కాపీలను అందించాల్సి ఉందన్నారు. సీఈఓ రామచంద్ర సేవలు ఎనలేనివన్నారు. జిల్లా పరిషత్‌ ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది, ప్రతి పక్షంతో పాటు అధికార పార్టీకి చెందిన అన్ని వర్గాల ప్రజలు తనకు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement