ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు | 32 injured in RTC bus, Truck collision | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

Published Sat, Jun 23 2018 7:19 AM | Last Updated on Thu, Jul 21 2022 11:47 AM

32 injured in RTC bus, Truck collision - Sakshi

నల్లగొండ :  నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాముల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఏలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 32 మంది ప్రయాణికుల్లో పదిమందికి గాయాలయ్యాయి. హైవేపైనే లారీలు నిలపడం వల్ల ఈ ప్రమాదం జరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికితోడూ బస్సు వైపర్‌ పని చేయకపోవడంతో బస్సు డ్రైవర్ కి రోడ్డు కనిపించక లారీని ఢీకొట్టాడని ప్రయాణికులు చెబుతున్నారు. 

ప్రమాదంలో బస్సు ఎడమభాగం ధ్వంసం అయ్యింది. దీంతో బస్సు ఎంట్రీ భాగం మూతపడటంతో ప్రయాణికులు బస్సులోనే 20 నిమిషాల వరకు ఉండి పోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఐటి పాముల గ్రామస్తులు లేచి బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి నిచ్చెనల సహాయంతో ప్రయాణికులను కిందకి దింపారు. 108 సహాయంతో నక్రేకల్, కామినేని ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement