గురుకుల పాఠశాలల్లో 324 సీట్లు భర్తీ
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): ఉమ్మడి జిల్లా(నిజామాబాద్, కామారెడ్డి)కు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండు జిల్లాల గురుకుల విద్యాలయాల సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ తులసీదాస్ నేతృత్వంలో మండలంలోని ధర్మారం(బి) గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ జరిగింది. రెండు జిల్లాల్లోని బాలురు, బాలికల గురుకుల పాఠశాలల్లో 324 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు.
ప్రవేశం పొందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ లోగా చేరాలన్నారు. ఆ తర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే మలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నా రు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోఆర్డినేటర్‌లు సరోజినిదేవి, ఉమాదేవి, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ సింధు, సంగీత, సత్యనారాయణ, కృతమూర్తి, రాజ్యలక్ష్మి, అసిస్టెంట్లు ప్రమోద్, నీరజ, చక్రపాణి, రాజేశ్వర్ పాల్గొన్నారు. కౌన్సిలింగ్‌కు భారీ సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలి వచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ కొనసాగింది.