34మంది ఎస్సైలకు పదోన్నతి | 34 SI's promoted to CI's | Sakshi
Sakshi News home page

34మంది ఎస్సైలకు పదోన్నతి

Published Sun, Jul 31 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

34 SI's promoted to CI's

 ఏలూరు (మెట్రో):  ఏలూరు రేంజ్‌ పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 34 మంది 2007 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ రేంజ్‌ yీ ఐజీ పీవీఎస్‌ రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 28 మందికి మాత్రమే సోమవారం పదోన్నతులను అందించనున్నారు. ఆరుగురు ఎస్సైలు వివిధ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విచారణ పూర్తయిన తరువాత వీరికి సీఐలుగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు జాబితా సోమవారం ప్రకటించనున్నారు.  
14 మంది ఏఎస్సైలకు..
రేంజ్‌ పరిధిలోని 14 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ డీఐజీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వీరి జాబితానూ సోమవారం ప్రకటించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement