పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకి 5,500 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకి 1,079 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,046, నరసాపురం కాలువకి 1,808, గోస్తనీ(జీఅండ్ వీ)కి 564, అత్తిలి కాలువకి 601 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 10,800 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు.