5వ రోజు రైతు భరోసా యాత్ర ఇలా..
Published Mon, Jan 9 2017 12:44 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
మహానంది: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర 5వ రోజు సోమవారం బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం నుంచి మొదలవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి తెలిపారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకు రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌బాషా కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్‌షో వెంగళరెడ్డిపేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదుగా మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురానికి చేరుకుంటుందన్నారు. ఆ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అనంతరం బుక్కాపురం, అల్లీనగరం వరకు రోడ్‌షో చేపడతారన్నారు.
Advertisement
Advertisement