రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు | 8members injured in road accident | Sakshi

రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు

May 21 2017 12:28 AM | Updated on Aug 30 2018 4:10 PM

గార్లదిన్నె(శింగనమల)/గుత్తి రూరల్‌ : గార్లదిన్నె మండలం కల్లూరులో 44వ జాతీయ రహదారిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ సమీపంలో ఆటో బోల్తాపడి ఎనిమిది మంది రైతులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గుత్తి మండలం తొండపాడుకు చెందిన రైతులు అనంతపురం మార్కెట్‌ యార్డులో జరిగిన సంతలో గొర్రెలు కొనుగోలు చేసి, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారన్నారు.

గార్లదిన్నె(శింగనమల)/గుత్తి రూరల్‌ : గార్లదిన్నె మండలం కల్లూరులో 44వ జాతీయ రహదారిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ సమీపంలో ఆటో బోల్తాపడి ఎనిమిది మంది రైతులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గుత్తి మండలం తొండపాడుకు చెందిన రైతులు అనంతపురం మార్కెట్‌ యార్డులో జరిగిన సంతలో గొర్రెలు కొనుగోలు చేసి, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారన్నారు. మార్గమధ్యంలో ఆటో వెనుక టైరు పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేకు వేసినట్లు తెలిపారు. దీంతో రోడ్డుపైనే ఆటో పల్టీలు కొట్టి హైవే పక్కనున్న ఇనుప కడ్డీలపై నిలబడిందన్నారు. ఘటనలో కట్టకిందపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, తొండపాడుకు చెందిన రంగన్న, నారాయణ, బాలరంగయ్య, కిశోర్, సుంకన్న, నరేంద్ర, లక్ష్మంపల్లికి చెందిన రాముడు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్‌ పరారయ్యాడు. వెంటనే 108కు సమాచారం ఇవ్వగా, వారొచ్చి గాయపడ్డ వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌ ఆరా తీశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement