kallur
-
చిత్తూరులో కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర
-
నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు
కల్లూరు(కర్నూలు జిల్లా): ఆయన పొలం యాజమాని. ఆ పొలంలోనే ఓ యువతి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఇరువురు ఇష్టపడ్డారు. ఏడాది పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా అంటూ యువతి బంధువుల ఎదుటే ప్రియుడికి బడితపూజ చేసింది. వివరాలు.. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా కుటుంబసభ్యులు వద్దంటున్నారని శేఖర్ బదులిచ్చాడు. చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ఎందుకు నాన్న.. సీన్ కట్ చేస్తే.. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరగా శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలాఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలింపించుకుని తెలంగాణలోని బంధువుల ఊరికి తీసుకెళింది. ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ నిరాకరించిన ప్రియుడిని కర్రతో చితక బాదింది. ఈ ఘటన అక్కడున్న వారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా సదరు యువతి ప్రేమ విషయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
యువతికి ఇటీవలే నిశ్చితార్థం.. కన్నీటిసంద్రంలో కుటుంబం
కల్లూరు : భవిష్యత్‌తో ఆ యువతి ఎన్నో కలలు కన్నది. వివాహం నిశ్చయమైన నేపథ్యంలో పెద్దలు త్వరలోనే ముహూర్తం నిర్ణయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలోనే మాయదారి విషజ్వరం ఆమెను కబళించింది. వివరాలిలా... కల్లూరు గ్రామపంచాయతీ పరిధి రామానగర్ కాలనీకి చెందిన కుంచాల వీరయ్య కుమార్తె వెంకటేశ్వరమ్మ (20)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు త్వరలోనే ఇరువైపులా పెద్దలు కూర్చుని ముహూర్తం నిర్ణయించాలని భావిస్తున్నారు. ఇంతలోనే వెంకటేశ్వరమ్మ విష జ్వరంబారిన పడగా, కల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా ఆమె సోమవారం మృతి చెందింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. కాగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు పరామర్శించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ చదవండి: తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు
గార్లదిన్నె(శింగనమల)/గుత్తి రూరల్ : గార్లదిన్నె మండలం కల్లూరులో 44వ జాతీయ రహదారిలోని అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో ఆటో బోల్తాపడి ఎనిమిది మంది రైతులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గుత్తి మండలం తొండపాడుకు చెందిన రైతులు అనంతపురం మార్కెట్ యార్డులో జరిగిన సంతలో గొర్రెలు కొనుగోలు చేసి, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారన్నారు. మార్గమధ్యంలో ఆటో వెనుక టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ సడన్ బ్రేకు వేసినట్లు తెలిపారు. దీంతో రోడ్డుపైనే ఆటో పల్టీలు కొట్టి హైవే పక్కనున్న ఇనుప కడ్డీలపై నిలబడిందన్నారు. ఘటనలో కట్టకిందపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, తొండపాడుకు చెందిన రంగన్న, నారాయణ, బాలరంగయ్య, కిశోర్, సుంకన్న, నరేంద్ర, లక్ష్మంపల్లికి చెందిన రాముడు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. వెంటనే 108కు సమాచారం ఇవ్వగా, వారొచ్చి గాయపడ్డ వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్ఐ ప్రదీప్ కుమార్ ఆరా తీశారు. -
చిత్తూరు జిల్లా పోలీసుల దాష్టీకం
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ పాతకేసు విచారణలో భాగంగా కల్లూరు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులకు ప్రత్యర్థులవ్వడం కారణంగా తమను పోలీసులు వేధిస్తున్నారంటూ...విచారణ ఎదుర్కొన్న వారిలో కిరణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతనిని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఎస్.ఐ కృష్ణయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని కిరణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. -
కల్లూరు ఏఎస్ఐ ఆత్మహత్య
ఖమ్మం: ఓ ఏఎస్ఐ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. వివరాలు... ఖమ్మం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐ గా పనిచేసే గుర్రం వెంకటేశ్వరరావు(48) ఈ నెల 13న కల్లూరుకు బదిలీ అయ్యారు. తర్వాత ఆయన 13న కల్లూరు స్టేషన్లో చార్జ్ తీసుకుని సెలవుపై వెళ్లారు. ఖమ్మంలోని ఇంటి దగ్గర ఉన్న ఉదయం నగరంలోని శ్రీనివాసనగర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురుకుల హాస్టల్లో ఎంపీ పొంగులేటి తనిఖీలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌ను ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గురుకులంలోబాత్రూమ్లు, మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే తమకు వడ్డించే ఆహారం పదార్ధాలు కూడా నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురుకుల నిర్వహకులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వహకులను హెచ్చరించారు. గురుకులంలో మౌలిక సదుపాయాల వసతులకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని విద్యార్థులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. -
చంద్రబాబు మాటలు నమ్మొద్దు
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటలను ఎవరూ నమ్మవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లీగల్‌సెల్ జిల్లా చైర్మన్ కారుమంచి రామకృష్ణారెడ్డితో పాటు న్యాయవాదులు జె.లక్ష్మీనారాయణ, మగ్బూల్, బేగ్, ఎస్.డేనియల్, జగదీశ్ తదితరులు... కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎస్వీ మోహన్రెడ్డినివాసంలో ఆయన సమక్షంలోనే వైఎస్ఆర్సీపీలో చేరారు. అలాగే జీషాన్, అబుహురైరా, జావీద్, ఫయాజ్, ఇర్ఫాన్, జావీద్, సమీర్, రెహ్మాన్, మనోజ్, జుబేర్‌తోపాటు 12వ వార్డుకు చెందిన సుమారు 100 మంది ప్రజలు వైఎస్ఆర్సీపీలో చేరారు. మారుతి, మాబు, చంటి, భరత్, భంజా, తేజ, చిన్న, అశోక్, మాను, శ్రీనులతో పాటు 1వ వార్డుకు చెందిన 100 మంది ప్రజలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వలసలు వెళుతున్నారని తెలిపారు. టీడీపీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నివర్గాల ప్రజలను మేలు చేశాయని, అలాంటి పాలన తిరిగి రావాలంటే ఒక్క జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.రమణ, బ్రదర్ రమణ, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తుస్సుమన్న బస్సు యాత్ర!
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్ర జిల్లాలో తుస్సుమంది. పార్టీ వర్గాలు భావించిన రీతిలో జనస్పందన కనిపించలేదు. కర్నూలు పాతబస్టాండులోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ గందరగోళంగా మారింది. ఈలలు, అరుపులే తప్ప పార్టీ నేతల సందేశాలు ఎవరికీ వినిపించకుండా పోయాయి. పార్టీ కార్యకర్తల కంటే చిరంజీవిని చూసేందుకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కొందరు అభిమానులు బల్లలెక్కి, కుర్చీలెక్కి అడ్డంగా నిలవడంతో.. సామాన్యులు నిరుత్సాహానికి గురై సభ మధ్యలోనే వెళ్లిపోయారు. మొదట పోలీసులు వేదిక వద్ద నుంచి అందర్ని పంపి వేసినా గోల అధికమయ్యే కొద్దీ వారు నిమ్మకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బస్సుయాత్ర గురువారం సాయంత్రం కర్నూలు నగరానికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ దిక్కుమొక్కు లేకుండానే ముగిసింది. సభకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, 2014 ఎన్నికల మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ఛైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మంత్రులు జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు మురళీ, డొక్కా మాణిక్యవరప్రసాద్, డీసీసీ నాయకులు తదితరులు హాజరయ్యారు. వీరి సభకు ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అహ్మద్‌అలీఖాన్ అనుచరులు తప్ప పార్టీ కార్యకర్తల సంఖ్య పల్చగా కనిపించింది. వీరి అల్లరికి సభలో ప్రసంగించిన వక్తలంతా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. డీసీసీ అధ్యక్షుడు, పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పదేపదే వారించినా ప్రయోజనం లేకపోయింది. నాయకులు కూడా చెప్పిందే చెప్పుకుంటూ వెళ్లడంతో ఎవరూ వినిపించుకోలేదు. ప్రతివక్త కూడా రాష్ట్ర విభజన పాపం తమది కాదని, ఇందులో అందరి ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర విభజనతో రాయలసీమకు, కోస్తాంధ్రకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని రెండో వాదనను వినిపించారు. ఓటు టీడీపీకి వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని చిరంజీవి అన్నారు.