గురుకుల హాస్టల్లో ఎంపీ పొంగులేటి తనిఖీలు | YSR CP MP Ponguleti Srinivasa Reddy checking in Gurukula hostel at kallur, khammam district | Sakshi
Sakshi News home page

గురుకుల హాస్టల్లో ఎంపీ పొంగులేటి తనిఖీలు

Published Sun, Nov 23 2014 9:03 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

గురుకుల హాస్టల్లో ఎంపీ పొంగులేటి తనిఖీలు - Sakshi

గురుకుల హాస్టల్లో ఎంపీ పొంగులేటి తనిఖీలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్ను ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గురుకులంలోబాత్రూమ్లు, మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే తమకు వడ్డించే ఆహారం పదార్ధాలు కూడా నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు.

దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురుకుల నిర్వహకులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వహకులను హెచ్చరించారు. గురుకులంలో మౌలిక సదుపాయాల వసతులకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని విద్యార్థులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement