షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగాయి.
-తప్పిన ప్రమాదం
విజయవాడ
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన విజయవాడ నగరంలోని చిట్టినగర్ వద్ద చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు కారులో దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారు అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదసమయంలో కారులో ఐదుగురు ఉన్నారు.