డిసెంబర్ 23న అరకు ట్రెక్కింగ్
Published Wed, Aug 10 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
బీచ్‌రోడ్: యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే కార్యక్రమాల బ్రోచర్‌ను బీచ్ రోడ్డులోని యూత్ హాస్టల్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ట్రెక్కింగ్, రాప్పిలింగ్, పేరా సైలింగ్, హాట్ బెలూనింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ ఏటా శీతాకాంలో నిర్వహించే అరకు ట్రెక్కింగ్ ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ ఏడాది నూతనంగా, విశాఖ చరిత్రలోనే ప్రథమంగా హాట్ ఎయిర్ బేలూన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ రవిపాల్, ఎం.సాయి రామరాజు, అచ్చితరామరాజు, కె.వి.రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement