- బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందచేత
- చిన్నారిని చదివించేందుకు కృషి చేస్తామని హామీ
మనూరు: మండల పరిధిలోని కరస్‌గుత్తి గంగారాం తండాలో గత నెల 19న ఒకేరోజు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన అయిదుగురు పిలల్ల కుటుంబాన్ని ఆత్మీయ ఫౌండేషన్ హైదరాబాద్‌వారు ఆసరాగా నిలిచారు. ఆదివారం సంస్థ నిర్వహకులు బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, దుస్తులు అందచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలుగా మారిన బాధితులకు తమ సంస్థ అండగా ఉంటుందన్నారు. నలుగురిలో చిన్నదైన లత(8)ను తాము దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించి స్థానిక తండావాసులతో వారు చర్చించారు.
ఇందుకు తండావాసులు అంగీకరించడంతో చట్టబద్దంగా చిన్నారిని త్వరలోనే తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు గుమ్మడి కిరణ్, వెన్నెల, ఎం.సువర్ణ, అనిల్, పవన్, నిఖిల్, రాజ్‌మోహన్, మండల బంజారాసేవాలాల్ సంఘం అధ్యక్షుడు రాందాస్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.