కొవ్వలిలో ఏసీబీ సోదాలు
Published Fri, Sep 2 2016 1:50 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
కొవ్వలి (దెందులూరు) : కొవ్వలి గ్రామంలోని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కంచర్ల విజయసాగరబాబు సోదరి ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. విజయసాగరబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో గ్రామంలోని సాగరబాబు సోదరి ఎస్.సుధారణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఏసీబీ డీఎస్పీ సుధాకర్, సీఐ జోసఫ్ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement