పూర్తికానున్న ఆనికట్‌ పనులు | Accelerate tasks to complete | Sakshi
Sakshi News home page

పూర్తికానున్న ఆనికట్‌ పనులు

Published Mon, Jun 12 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

పూర్తికానున్న ఆనికట్‌ పనులు

పూర్తికానున్న ఆనికట్‌ పనులు

► రెండేళ్లుగా పనుల్లో జాప్యం
► రూ.3.3 కోట్లతో నిర్మాణం


జైనథ్‌: మండలంలోని పిప్పల్‌గావ్‌ వాగుపై రూ.3.3కోట్లతో నిర్మిస్తున్న ఆనికట్‌ పనులు ఎట్టకేలకు పూర్తి కానున్నాయి. వాగు గుండా వృథాగా పోతున్న నీటిని లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి మళ్లించడానికి నిర్మిస్తు న్న ఈ ఆనికట్, ఒపెన్‌ కెనాల్‌ పనులు 2015 డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. 2016 జనవరి నుండి జోరుగా పనులు నడుస్తున్నాయి. వాస్తవానికి 2016 ఆగస్ట్‌లో పూర్తి కావల్సి ఉన్నప్పటికీ కూడ నెలలుగా జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి.

రిజర్వాయర్‌కు స్వయం ప్రాతిపత్తి కోసం..
మండలంలో అతి ప్రధానమైన వాగుల్లో పిప్పల్‌గావ్‌ వాగు ఒకటి. దీని ద్వారా ప్రతీ ఏడాది నీరు వృథాగా పెన్‌గంగలో కలుస్తోంది. అయితే సాత్నాల ప్రాజెక్టు నీటిపై ఆధారపడి కొనసాగుతున్న లక్ష్మీపూర్‌ బ్యారేజీకి స్వయం ప్రాతిపత్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ వాగును రిజర్వాయర్‌లోకి మళ్లించేందుకు అధికారులు రూ.3.3కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే వాగుపై ఆనికట్‌ నిర్మించారు. ప్రస్తుతం ఒపెన్‌ కెనాల్‌ పనులు కొనసాగుతున్నాయి.

వాస్తవానికి ఆనికట్‌ నుంచి 1300మీటర్ల మేరకు 3మీటర్ల వెడల్పుతో బ్యారేజీ వరకు ఒపెన్‌ కెనాల్‌ నిర్మిస్తే పనులు పూర్తి అయినట్లే. ఇక్కడ భూమిలో బండ రాయి విపరితంగా ఉండటంతో పనులు జాప్యం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పడు కాలువ పనులు దాదాపుగా పూర్తి అయినప్పటికి కూడ ఇంకా సాత్నాల ఎల్‌3 వద్ద కొంత బ్లాస్టింగ్‌ పనులు మిగిలిపోయాయి. దీంతో పాటు ఆనికట్‌ వద్ద కెనాల్‌ ప్రారంభమయ్యే ప్రదేశం తూము గేట్‌ నిర్మించాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలోనే పిప్పల్‌గావ్‌ వాగు నీటిని రిజర్వాయర్‌లోకి మళ్లించి చేన్లకు సాగునీరు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.

20 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం...
వాస్తవానికి ఆనికట్‌ పనులు 2016 ఆగస్ట్‌లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో జాప్యం జరిగింది. సాత్నాల ఎల్‌3 కాలువ సమీపంలో బ్లాస్టింగ్‌ పనులు, ఆనికట్‌ వద్ద తూం గేట్‌ నిర్మాణం పనులు మినహా అన్ని పనులు పూర్తి అయ్యాయి. 20 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.  ఆ దిశగా పనులను వేగవంగం చేశాం. ఎట్టి పరిస్థితితుల్లోనూ ఈ సంవత్సరం వర్షాకాలలో వాగు నీరు వృథా పోకుండా, రిజర్వాయర్‌కి మళ్లిస్తాం.  – మారుతి, సాత్నాల, జేఈ

Advertisement
Advertisement