ఎకరా రూ. 5 కోట్లు పై మాటే!
ఎకరా రూ. 5 కోట్లు పై మాటే!
Published Sat, Aug 13 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
బుచ్చెయ్యపేట: రియల్ ఎస్టేట్ వ్యాపారం పుణ్యమా అని పంట భూములన్నీ ప్లాట్లుగా పెరిగిపోవడంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎకరా రూ.10 లక్షలు కూడా పలకని భూములు ఇప్పుడు ఏకంగా రూ.కోటి పైమాటే. రావికమతం సెం టర్‌లో అయితే సెంటు భూమే రూ.7 లక్షలు దాటి ఉంటోంది. అం టే ఎకరా ఏడు కోట్లు. రావికమతం సమీపంలో గ్రామా లు ఎక్కువగా ఉండ టం, బిజినెస్ పా యింట్ కావడంతో అక్కడ ఆ రేటు పలుకుతోంది. ఇక వడ్డాది జంక్షన్‌లో అయితే మాడుగుల వెళ్లే రోడ్డులో సెంటు రూ.3 లక్షలు, చోడవరం వెళ్లే రోడ్డులో 2 లక్షలు, నర్సీపట్నం వెళ్లే రోడ్డులో 4 లక్షలు, జాలంపల్లి రోడ్డులో సెం టు రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతోంది.
పెరిగిన డిమాండ్
వడ్డాది, బంగారుమెట్ట, విజయరామరాజుపేట తదితర గ్రామాల్లో ఇప్పుడు భూమి బంగారంగా మారింది. భీమునిపట్నం వయా చోడవరం మీదుగా నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో ఉన్న భూములు ఇటీవల విపరీతంగా పెరిగాయి. లోపూడి వద్ద కొత్తగా డీఆర్‌డీవోకు చెందిన సైనిక శిక్షణ కేంద్రం, పామాయిల్ ఫ్యాక్టరీ, డాల్ఫిన్ కూలింగ్ కేంద్రంతోపాటు పలు ఫ్యాక్టరీలు ఈ రోడ్డులోనే ఉన్నాయి. మెయిన్‌రోడ్డు కావడంతో ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా వడ్డాది– రావికమతం రోడ్డు మారింది. రియల్టర్లు ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు కోసం వస్తుండటంతో ఇక్కడి భూములకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. బీఎన్ రోడ్డుకు సమీపంలోనే కొండెంపూడి రెవెన్యూలో వ్యవసాయ పరిశోధనకు కృషి విజ్జాన కేంద్రం(కేవీకే) ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడంతో ఇక్కడి భూములకు గిరాకీ పెరిగింది. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు సెంటు రూ.50వేలు నుంచి రెండు లక్షల వరకు పలుకుతుంది. అంటే ఎకరా రూ.కోటి పైమాటే.
భారీగా క్రయవిక్రయాలు
మల్లాం, రాజాం ప్రాంతంలో ఎస్‌ఈజెడ్ కోసం సేకరించేందుకు మొదట్లో అధికారులు ప్రయత్నించగా అదే ప్రదేశంలో ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు పెట్టేందుకు కొందరు ముందుకు రావడంతో ఇప్పుడే ఎకరా రూ.20–30లక్షలు వరకు అమ్ముతోంది. వ్యాపార లావాదేవీ కేంద్రంగా విస్తరిస్తున్న, మారుమూల ఉన్న సీతయ్యపేట నాల్గురోడ్ల జం„ý న్‌లో సైతం లక్షలాది రూపాయలు పలుకుతోంది.
శ్రావణమాసం మంచి రోజులు కావడంతో ఇటీవల భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో సామాన్యులు సెంటు భూమి కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు.
Advertisement
Advertisement