ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం
Published Sun, Mar 5 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
ఆదోని టౌన్: అపరిష్కృతంగా మిగిలిపోయిన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామని వైఎస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టరు కేవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌ఎంబీ పంక‌్షన్ హాలులో ఆదివారం ఆదోని నియోజక వర్గ ఉపాధ్యాయులతో వైఎస్సార్సీపీ పట్టణ గౌరవాధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు బడ్జెట్ కంట్రోల్ ఎత్తివేత, అన్ ఎయిడెడ్ సర్వీసుకు ఇంక్రిమెంట్లు, భాషా పండితుల పదోన్నతులకు కృషి చేస్తామన్నారు. ఉర్దూ పాఠశాలలకు రిజర్వేషన్ల సడలింపు, కస్తూర్బా టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ తదితర వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా పోరాడతామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, కార్యదర్శి ప్రసాదరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సలీం, కామాక్షి తిమ్మప్ప, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘనాథ్ రెడ్డి, శేషిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లుబోతుల సురేష్, మండల కన్వీనరు విశ్వనాథ్ గౌడు, మాజీ ఎంపీపీ పంపాపతి, ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిరాజులు, సుధాకరరెడ్డి, వినోద్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Advertisement