సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్సీపై ప్రభుత్వం స్పందన కొరవడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. చలో అసెంబ్లీ కోసం ఉపాధ్యాయులు లీవ్ అడిగిన ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రం 27 శాతం మధ్యంతర భృతి అమలు చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల భర్తీని వెంటనే ప్రభుత్వం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధం కోసం తెలంగాణ సాధించామా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంతృత్వ విధానం విడనాడాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వం విద్య, వైద్య విధానం ప్రజల మెప్పుపొందుతుందని.. పక్క రాష్ట్రం ఏపీ మూడో డీఎస్సీ నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలో మండల స్థాయి విద్యా విధానం నిర్వీర్యం అవుతుందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తలపెట్టిన చలో అసెంబ్లీ అడ్డుకునే విధంగా పోలీసుల ముందస్తు అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment