సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ సమస్యపై మెట్‌పల్లి రైతులు అసెంబ్లీకి వస్తే లాఠీచార్జి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించే మాట్లాడతారే తప్ప.. కాయిలా పడిన చక్కెర కార్మగారం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ శాసన మండలికి రారని.. అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేత ధోరణిలో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇస్తున్నామంటూ రాయితీలకు కోత పెట్టడం ఏమిటని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment