kv subbareddy
-
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఆదోని టౌన్: అపరిష్కృతంగా మిగిలిపోయిన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామని వైఎస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టరు కేవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎస్ఎంబీ పంక్షన్ హాలులో ఆదివారం ఆదోని నియోజక వర్గ ఉపాధ్యాయులతో వైఎస్సార్సీపీ పట్టణ గౌరవాధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు బడ్జెట్ కంట్రోల్ ఎత్తివేత, అన్ ఎయిడెడ్ సర్వీసుకు ఇంక్రిమెంట్లు, భాషా పండితుల పదోన్నతులకు కృషి చేస్తామన్నారు. ఉర్దూ పాఠశాలలకు రిజర్వేషన్ల సడలింపు, కస్తూర్బా టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ తదితర వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా పోరాడతామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, కార్యదర్శి ప్రసాదరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సలీం, కామాక్షి తిమ్మప్ప, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘనాథ్ రెడ్డి, శేషిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లుబోతుల సురేష్, మండల కన్వీనరు విశ్వనాథ్ గౌడు, మాజీ ఎంపీపీ పంపాపతి, ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిరాజులు, సుధాకరరెడ్డి, వినోద్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సీమ అభివృద్ధికి కృషి
– వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టరు కేవీ సుబ్బారెడ్డి ఆదోని టౌన్: తనను గెలిపిస్తే రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. తనకు వచ్చే వేతనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకే ఖర్చు చేస్తానని చెప్పారు. ఆదోని పట్టణంలో శనివారం పార్టీ శ్రేణులతో కలసి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అమూల్యమైన ఓటు తనకే వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను గెలిపిస్తే సీమ అభివృద్ధి కోసం తన ఆస్తుల్లో రూ. పది కోట్లను ఖర్చు పెడతానని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో నిరుద్యోగ యువత, ఉద్యోగుల కోసం గెస్ట్ హౌస్‌లు ఏర్పాటు చేస్తానన్నారు. సాధారణ రోజుల్లో ఇవి కల్చరల్ సెంటర్లుగా పనిచేస్తాయన్నారు. సీమ వాసి అయిన సీఎం చంద్రబాబు నాయుడు.. రాయలసీమ గురించి ఢిల్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అన్నారు. తల్లి లాంటి సీమ కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానన్నారు. ఏకీకృత రూల్స్, పీఆర్సీ, డీఎలు, అరియర్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. పాఠశాలల్లో బయో మెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పేరుకే ఉద్యోగుల హెల్త్ కార్డులని ఇస్తున్నారని, వర్సిటీల్లో పరిశోధనలు జరగడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, శేషిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవ, బీసీ సెల్‌పట్టణ అధ్యక్షుడు మహేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లుబోతుల సురేష్, మండల కన్వీనరు విశ్వనాథ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.