ఫేక్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి | alert to fake calls says state bank manager | Sakshi
Sakshi News home page

ఫేక్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి

Published Fri, Nov 11 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

ఫేక్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి

ఫేక్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి

ఖాతాలో డబ్బులు కాజేస్తారు
-  స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ విష్ణువర్ధన్‌
కంబదూరు : పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజలు గందరగోళంగా ఉన్నారు. పాత నోట్లను మార్చుకునే పనిలో జనం బిజీబిజీగా ఉన్నారు. దీనిని కొంతమంది హాకర్లు అదునుగా చేసుకుని చెలరేగి పోతున్నారు. ఇలాంటి తరుణంలో ఖాతాదారులు వచ్చే ఫోన్‌కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండి డబ్బులను కాపాడుకోవాలని కంబదూరు స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ విష్ణువర్ధన్‌ సూచించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి పాత నోట్లు రద్దయిన వాటి స్థానంలో కొత్త నోట్లు వస్తున్న తరుణంలో మీ బ్యాంక్‌కు సంబం«ధించిన వివరాలు కావాలని అడుగుతారు.

తర్వాత మీ ఎంటీఎం మొదటి ఆరు నంబర్లు చెప్పి, మీపేరు చెబుతారు. ఈ అకౌంట్‌ నంబర్‌ మీదైతే మిగిలిన నంబర్లు, మీ సీక్రెట్‌ పిన్‌ నంబర్‌ చెప్పాలంటారు. దీంతో మనం కొత్త నోట్ల హడావుడిలో మీ వివరాలు చెప్పామంటే వెంటనే ఖాతాలోని డబ్బులను మాయం చేస్తారు. కాబట్టి ఫేక్‌ఫోన్‌ కాల్స్‌ వల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా బ్యాంక్‌ అధికారులు మీ సిక్రెట్‌ వివరాలు ఎప్పుడూ అడగరు ఈ విషయాన్ని ఖాతాదారులు దృష్టిలో ఉంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement