- గ్యాస్ ఏజన్సీ డీలర్ల సమావేశంలో జాయింట్ కలెక్టెర్
అన్ని కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు
Published Tue, Jan 3 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
కాకినాడ సిటీ :
వందశాతం గ్యాస్ కనెక్షన్లు ఉన్న జిల్లాగా మార్చే విధంగా అన్ని కుటుంబాలకు వంట గ్యాస్‌కనెక్షన్ల పంపిణీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో గ్యాస్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్యాస్ కనెక్షన్ల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 20 వేలS619 మంది గ్యాస్‌కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిజానికి జనాభా లెక్కల ప్రకారం 14 లక్షల 65వేల 351 కుటుంబాలు జిల్లాలో ఉన్నాయని, ఇంకా లక్షా 69వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తే వందశాతం పూర్తవుతుందన్నారు. ఆ మేరకు మార్చి నాటికి గ్యాస్‌కనెక్షన్ల పంపిణీ పూర్తిచేయాలని డీలర్లకు స్పష్టం చేశారు. తదుపరి మిగిలిన కుటుంబాలందరికీ గ్యాస్‌కనెక్షన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జన్మభూమి, మా ఊరు సభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా సభల్లో ఇప్పటికే మంజూరైన గ్యాస్‌కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వేమూరి రవికిరణ్, ఏఎస్‌ఓ పీతల సురేష్, వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement