ఖమ్మంలో అమెరికన్ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ప్రారంభం
ప్రారంభించిన జెడ్పీ చైర్‌పర్సన్ కవిత
ఖమ్మం కల్చరల్ : ఖమ్మంలో అమెరికన్ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయటం హర్షణీయమని జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ఆదివారం నగరంలోని కవిరాజ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 180 గ్లోబుల్ స్పోకెన్ ఇంగ్లిష్ ఇనిస్టిట్యూట్‌ను ఆమె ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ వస్తేనే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులున్నాయని, అమెరికా వెళ్లేందుకు ఈ అవకాశాన్ని విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు వినియోగించుకోవాలన్నారు. అనంతరం డెరైక్టర్ జాన్‌పాల్ మాట్లాడుతూ రూ. 3వేల తక్కువ ఖర్చుతోనే ఇంగ్లిష్‌కు సంబంధించిన కమ్యూనికేషన్ బేసిక్స్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, దైనందిన జీవితంలో ఇంగ్లిష్ వాడకం, పబ్లిక్ స్పీకింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ రెండు నెలల్లోనే నేర్పుతామన్నారు. ఈ కోర్సులో చేరేందుకు 10వ తరగతి, ఆపై చదివిన విద్యార్థులు అర్హులన్నారు. కార్యక్రమంలో టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఎస్‌బీఐటీ ప్రిన్సిపాల్ రామారావు, న్యూఇరా స్కూల్ సెక్రటరీ అండ్ కర్పసాండెంట్ రమణారావు, 16వ వార్డు కార్పోరేటర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.