వికెట్లతో రాణించిన అనంత స్పిన్నర్‌ | An infinite spinner with 6 wickets | Sakshi
Sakshi News home page

వికెట్లతో రాణించిన అనంత స్పిన్నర్‌

Published Tue, Jul 11 2017 11:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

An infinite spinner with 6 wickets

  • కర్నూలుపై ఇన్నింగ్స్‌ 365 పరుగులతో అనంత ఘన విజయం
  • ముదస్సిర్‌ మాయాజాలం
  • అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ముదుస్సిర్‌ బంతితో మాయాజాలం చేశాడు. తన స్పిన్‌తో కర్నూలును బోల్తా కొట్టించాడు. 6 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కడపలో జరుగుతున్న అండర్‌–19 అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీల్లో అనంతపురం జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం 12–2 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కర్నూలు జట్టు...అనంత బౌలర్లు ముదస్సిర్, సాంబశివల ధాటికి 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.

    దీంతో అనంతపురం జట్టు ఇన్నింగ్స్ 354 పరుగులతో రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు అనంత బౌలర్లు ముదస్సిర్‌ 11.3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. సాంబశివ 14 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లను సాధించాడు. దీంతో అనంత జట్టుకు 7 పాయింట్లు లభించాయి. అనంత జట్టు ప్రదర్శనపై జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, కేఎస్‌ షాహబుద్దీన్‌లు హర్షం వ్యక్తం చేశారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement