చెరువులు ఎలా నింపుతారు? | anantha venkatramireddy statement on handri niva canal | Sakshi
Sakshi News home page

చెరువులు ఎలా నింపుతారు?

Published Thu, Sep 15 2016 12:12 AM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM

anantha venkatramireddy statement on handri niva canal

హిందూపురం అర్బన్‌ : హంద్రీ–నీవాకు అదనపు కేటాయింపులు లేకుండా చెరువులను ఎలా నింపుతారంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. బక్రీద్‌ సందర్భంగా హిందూపురంలో పార్టీ ఏ బ్లాక్‌ కన్వీనర్‌ ఇర్షాద్‌అహ్మద్‌ ఏర్పాటు చేసిన విందుకు ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డిని సన్మానించారు. అనంతరం అనంత మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీనీవా మొదటి దశ పనులు దాదాపు పూర్తి చేశారన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పట్లోనే నిర్ణయించారన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే జీడిపల్లి రిజర్వాయర్‌ వరకు నీటిని తీసుకువచ్చారన్నారు. 2012 నుంచే హంద్రీనీవా ద్వారా నీరు వస్తోందన్నారు.

అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడేమో హంద్రీనీవా నుంచి మరిన్ని చెరువులకు నీరు అందిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అదనపు నీటి కేటాయింపు లేకుండా నీరు ఎలా ఇస్తారని నిలదీశారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి చేస్తున్న ఎత్తుగడ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజుల్‌ రెహమాన్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, రజనీ, మహిళ కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, మండల కన్వీనర్లు బసిరెడ్డి, నారాయణస్వామి, నాయకులు సమద్, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement