‘ఆంధ్రా’ పోలీసుల బదిలీకి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: విభజనలో భాగంగా ఇక్కడ ఉండిపోయిన ఆంధ్రప్రాంత పోలీస్ అధికారులు, సిబ్బందిని బదిలీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం అధికారులను మాత్రమే పంపించకుండా... ప్రస్తుతం వారు పనిచేస్తు న్న హోదాలోనే ఏపీకి కేటాయించేందుకు ప్రతిపాదనలను రూపొందించారు. ఈ మేర కు రెండు వేల పోస్టులు కొత్తగా మంజూరు చేయాల్సి ఉంటుందని పోలీస్ శాఖ ప్రభుత్వా నికి నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం.
పోస్టు.. అధికారి...
తెలంగాణలోని పోలీస్ బెటాలియన్లలో పనిచేస్తున్న కమాండెంట్లు, అసిస్టెంట్ కమాం డెంట్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సబ్‌ఇన్ స్పెక్టర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు.. ఇలా అన్ని హోదాల్లో ఉన్న 2 వేలమంది ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తమపై ఆర్థికంగా భారం పడుతుందన్న కారణంతో ఈ ప్రతి పాదన పెండింగ్‌లో పెట్టింది. దీనికి తెలం గాణ పోలీస్ అధికారులు సరికొత్త ప్రతిపాద నను తీసుకువచ్చారు.తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, వారు పనిచేస్తున్న పోస్టులతో సహా తాము ఏపీకి రిలీవ్ చేస్తామని, వీరి స్థానంలో అదే సంఖ్యలో కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటామని తెలపడంతో ఏపీ ప్రభుత్వం కూడా సమ్మతించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
దీనితో ఏపీ ప్రభుత్వానికి కొత్తగా పోస్టుల మంజూరు గానీ, పదోన్నతుల సమస్యగానీ, సీనియారిటీ సమస్యగానీ లేకుండా పోయిం ది. అదే విధంగా తెలంగాణలోనూ చాలా ఏళ్లుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్న స్పెషల్ పోలీస్ అధికారుల కోరిక నెరవేరే మార్గం సుగుమమైంది. ప్రస్తుతం ఈ రెండు వేల మంది అధికారులు తెలంగాణ ప్రభుత్వ మే జీతభత్యాలు భరిస్తోంది. ఇవే జీతభ త్యాలను కొత్తగా మంజూరయ్యే పోస్టుల్లో నియమించే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుం ది. దీని వల్ల ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా పెద్దగా ఆర్థిక భారం ఉండదు. కాబట్టి రెండు రాష్ట్ర పోలీస్ శాఖలు ఈ నిర్ణయానికి సుముఖంగా ఉండటంతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతు న్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలను దాదాపు పూర్తి చేసిన పోలీస్ శాఖ త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది.