Seniority issue
-
జోసెఫ్ సీనియార్టీపై అసంతృప్తి
న్యూఢిల్లీ: జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించడంపై సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేశారు. మంగళవారం జస్టిస్ జోసెఫ్‌తోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీజేఐని కలిసి నిరసన తెలిపిన వారిలో కొలీజియంలోని ఇద్దరు సీనియర్ జడ్జీలు జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు. కేంద్ర నోటిఫికేషనే ఫైనల్! కేంద్రం శుక్రవారం ముగ్గురు జడ్జీల పేర్లతో విడుదల చేసిన నియామకపు నోటిఫికేషన్లో జస్టిస్ జోసెఫ్ పేరును ప్రకటించినప్పటికీ ఆయన సీనియారిటీని తగ్గిస్తూ మూడోస్థానంలో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. జనవరి 10న కొలీజియం సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాతోపాటుగా జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రతిపాదించింది. అయితే, ఇందు మల్హోత్రా పేరును అంగీకరించిన కేంద్రం.. జోసెఫ్ పేరును తిరస్కరించింది. మే 16న మరోసారి కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ప్రతిపాదనల్లో పెట్టింది. జూలైలో దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జోసెఫ్ పేరును పేర్కొనడంతో కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి తెరపడ్డట్లేనని అర్థమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే బాధ్యతల స్వీకరణ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరగనుంది. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం, రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దశలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కోర్టు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆలిండియా జాబితాలో జోసెఫ్ః39 ‘హైకోర్టు జడ్జీల ఆలిండియా సీనియారిటీ లెక్కల్లో జస్టిస్ బెనర్జీ 4వ స్థానంలో, జస్టిస్ సరన్ 5వ స్థానంలో, జస్టిస్ జోసెఫ్ 39వ స్థానంలో ఉన్నారు’ అని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు జడ్జీలూ సీజేఐ కాలేరని.. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం జడ్జీలుగా ఉన్న వారు వీరికంటే సీనియర్లని తెలిపాయి. ఈ ముగ్గురిలో జస్టిస్ జోసెఫ్ 2023లో రిటైరవుతుండగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 2024 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారన్నాయి. అప్పటికి ఆయనే సీజేఐగా ఉండొచ్చన్నాయి. కాగా, సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, జాబితాను మార్చేందుకు వీలుందని మాజీ సీజేఐ జస్టిస్ లోధా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్వాగతించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సీనియారిటీ ఆధారంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్: కేంద్రం జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించారంటూ నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్లో సీనియారిటీ (హైకోర్టు సీనియారిటీ ఆధారంగా) నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సరన్‌లతో పోలిస్తే జస్టిస్ కేఎం జోసెఫ్ రెండేళ్లు జూనియర్ కాబట్టే ఆయన్ను సీనియారిటీలో మూడోస్థానం కల్పించినట్లు పేర్కొంది. జస్టిస్ జోసెఫ్ 2004 అక్టోబర్ 14న హైకోర్టు న్యాయమూర్తిగా.. 2014, జూలై 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన 2023 జూన్ 16న రిటైరవుతారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2002, ఫిబ్రవరి 5న హైకోర్టు జడ్జిగా 2017, ఏప్రిల్ 5న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె 2022, సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరవుతారు. జస్టిస్ సరన్ 2002, ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా, 2016 ఫిబ్రవరి 26న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022, మే 10న ఈయన పదవీ విరమణ చేస్తారు. జోసెఫ్‌తో పోలిస్తే మిగిలిన ఇద్దరు రెండేళ్ల ముందుగానే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అంశాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. -
జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ తగ్గింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామక వివాదం మరో మలుపు తిరిగింది. జోసెఫ్ నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. తాజాగా శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆయన సీనియారిటీని తగ్గించింది. కొలీజియం తొలుత జస్టిస్ జోసెఫ్ పేరును, ఆతర్వాత జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌ల పేర్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కానీ కేంద్రం మాత్రం జోసెఫ్ పేరును జాబితాలో మూడోస్థానంలో ఉంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిబంధనల ప్రకారం మొదటగా కొలీజియం సిఫార్సు చేసిన పేర్లనే నోటిఫికేషన్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రచురించాలి. దీంతో కేంద్రం చర్యపై కొలీజియం సభ్యులు సహా పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న లక్ష్మణరేఖను ప్రభుత్వం దాటిందని మండిపడుతున్నారు. ఈ విషయమై జడ్జీలు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను సోమవారం కలసి ఫిర్యాదు చేయనున్నారు. ముగ్గురు జడ్జీలు ప్రమాణస్వీకారం చేసేలోపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేఐపై ఒత్తిడి తీసుకురానున్నారు. జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ విషయమై దీపక్ మిశ్రాతో నేడు సమావేశమై ఈ విషయంలో తమ అభ్యంతరాలను సీజేఐ ముందు ఉంచనుంది. ప్రసుత్తం దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల సీనియారిటీలో జస్టిస్ జోసెఫ్ 45వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో జస్టిస్ జోసెఫ్ పేరును కొలీజియం సిఫార్సు చేయగా.. ఇతర రాష్ట్రాల నుంచి సుప్రీంకు తగిన ప్రాతినిధ్యం లేదంటూ ఆ ప్రతిపాదనను కేంద్రం తిప్పిపంపింది. దీంతో జోసెఫ్ పేరును కొలీజియం మరోసారి ఆమోదించి పంపడంతో మరో మార్గం లేక కేంద్రం ఆమోదించింది. అయితే మిగతా ఇద్దరు జడ్జీల కంటే ఆయన్ను జూనియర్‌గా చేస్తూ శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు ఆగస్టు 3న రాష్ట్రపతి కోవింద్ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఇద్దరు న్యాయమూర్తుల కంటే జస్టిస్ జోసెఫ్ జూనియర్‌గా మారారు. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను జోసెఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జీగా కొట్టివేశారు. ఈ కారణంగానే ఆయన పదోన్నతికి ప్రభుత్వం అడ్డుతగులుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. -
‘ఆంధ్రా’ పోలీసుల బదిలీకి సన్నాహాలు
-
‘ఆంధ్రా’ పోలీసుల బదిలీకి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: విభజనలో భాగంగా ఇక్కడ ఉండిపోయిన ఆంధ్రప్రాంత పోలీస్ అధికారులు, సిబ్బందిని బదిలీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం అధికారులను మాత్రమే పంపించకుండా... ప్రస్తుతం వారు పనిచేస్తు న్న హోదాలోనే ఏపీకి కేటాయించేందుకు ప్రతిపాదనలను రూపొందించారు. ఈ మేర కు రెండు వేల పోస్టులు కొత్తగా మంజూరు చేయాల్సి ఉంటుందని పోలీస్ శాఖ ప్రభుత్వా నికి నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం. పోస్టు.. అధికారి... తెలంగాణలోని పోలీస్ బెటాలియన్లలో పనిచేస్తున్న కమాండెంట్లు, అసిస్టెంట్ కమాం డెంట్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ఇన్ స్పెక్టర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు.. ఇలా అన్ని హోదాల్లో ఉన్న 2 వేలమంది ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తమపై ఆర్థికంగా భారం పడుతుందన్న కారణంతో ఈ ప్రతి పాదన పెండింగ్‌లో పెట్టింది. దీనికి తెలం గాణ పోలీస్ అధికారులు సరికొత్త ప్రతిపాద నను తీసుకువచ్చారు.తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, వారు పనిచేస్తున్న పోస్టులతో సహా తాము ఏపీకి రిలీవ్ చేస్తామని, వీరి స్థానంలో అదే సంఖ్యలో కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటామని తెలపడంతో ఏపీ ప్రభుత్వం కూడా సమ్మతించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. దీనితో ఏపీ ప్రభుత్వానికి కొత్తగా పోస్టుల మంజూరు గానీ, పదోన్నతుల సమస్యగానీ, సీనియారిటీ సమస్యగానీ లేకుండా పోయిం ది. అదే విధంగా తెలంగాణలోనూ చాలా ఏళ్లుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్న స్పెషల్ పోలీస్ అధికారుల కోరిక నెరవేరే మార్గం సుగుమమైంది. ప్రస్తుతం ఈ రెండు వేల మంది అధికారులు తెలంగాణ ప్రభుత్వ మే జీతభత్యాలు భరిస్తోంది. ఇవే జీతభ త్యాలను కొత్తగా మంజూరయ్యే పోస్టుల్లో నియమించే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుం ది. దీని వల్ల ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా పెద్దగా ఆర్థిక భారం ఉండదు. కాబట్టి రెండు రాష్ట్ర పోలీస్ శాఖలు ఈ నిర్ణయానికి సుముఖంగా ఉండటంతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతు న్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలను దాదాపు పూర్తి చేసిన పోలీస్ శాఖ త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది.