
సచివాలయ ఉద్యోగుల తరలింపు మళ్లీ వాయిదా
అమరావతి: తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగుల తరలింపు తేదీ మళ్లీ వాయిదా పడింది. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీకి మారింది. అయితే ఈ నేల 29వ తేదీన ఐదో బ్లాక్లోని ఒక్కఫ్లోర్ మాత్రమే ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వెల్లడించారు. జులై 15వ తేదీన కొన్ని బ్లాకులు, 21వ తేదీన మరికొన్ని బ్లాక్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జులై మాసం చివరి నాటికి మొత్తం తరలింపు పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఫైళ్లన్నీ ఇకపై ఆన్లైన్లో ఉంచుతామని చంద్రబాబు చెప్పారు.