మరో ఏడు ఐటీ పార్కులు!
♦ ఇప్పటికే స్థలాలు ఎంపిక చేసిన యంత్రాంగం
♦ మరో ఐటీ హబ్‌గా మారనున్న బుద్వేల్
♦ జర్నలిస్టులకు నిర్దేశించిన స్థలం కూడా ఐటీకే
♦ ప్రత్యామ్నాయంగా మియాపూర్ వద్ద కేటాయింపు
♦ ‘ఐటీ’ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యూహం
♦ ఐటీ కంపెనీలు రానున్న ప్రాంతాలు
- బుద్వేల్‌లో నం.291 టు 299/పీ వరకు గల 91 ఎకరాలు, సర్వే నం. 282-299 లలోని 164.35 ఎకరాలు, వీడీఓటీ సీ ఆధీనంలో ఉన్న 120 ఎకరాలు
- వాలంతరీలోని 252 ఎకరాలు, పుప్పాల్‌గౌడ సర్వే నం.304-307, 329, 331-339లలోని 100.12 ఎకరాలు
- మియాపూర్‌లోని సర్వే నం.28, 29 లోని 160 ఎకరాలు
- దుండిగల్‌లోని సర్వే నం.453, 454 లోని భూమి.
ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలకు ఎర్రతివాచీ పరిచేందుకు ప్రభుత్వం రాజధాని శివార్లలో మరో ఏడు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్న నేపథ్యంలో.. అందుకనువైన వసతులను కల్పించే దిశగా కార్యాచరణ తయారు చేసింది. ఈ మేరకు నగర శివార్లలో ఐటీ పార్కులకు అవసరమైన భూములను గుర్తించింది. నిర్దేశిత ఐటీ పార్కుల జాబితాను కే ంద్ర ప్రభుత్వానికి పంపడం ద్కారా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ద్వారాలు తెరవాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే ఐటీ హబ్‌గా మారిన గ చ్చిబౌలి, మాదాపూర్ కాకుండా.. ఐటీ పరిశ్రమను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శివార్లలో తొమ్మిది చోట్ల ఐటీ పార్కులను ప్రకటించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఇందులో రెండు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏడింటిని సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇటీవల ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఐటీ పార్కుల అభివృద్ధిపై విస్తృ త చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే బుద్వేల్‌లో పర్యాటక సంస్థకు చెందిన సర్వే నం.291 టు 299/పీ వరకు గల 91 ఎకరాలు, సర్వేనం.
282-299 లలోని 164.35 ఎకరాలను ఐటీ పార్కులకు వినియోగించనున్నారు. అలాగే ఇటీవల జర్నలిస్టుల హౌసింగ్ కాలనీ కోసం ప్రతిపాదించిన బుద్వేల్‌లోని వీడీఓటీ సీ ఆధీనంలో ఉన్న 120 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నా రు. జర్నలిస్టులకు ప్రత్యామ్నాయంగా మియాపూర్‌లో కేటాయించాలని నిర్ణయించారు. అలాగే వాలంతరీ లోని 252 ఎకరాలు, పుప్పాల్‌గౌడ సర్వే నం.304-307, 329, 331-339లలోని 100.12 ఎకరాల్లో కూడా ఐటీ పార్కు రానుంది.
శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నం.28,29లలోని 160 ఎకరాలు, కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని సర్వే నం.453,454లోని భూమిని కూడా ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఈ భూములను ఐటీ శాఖకు బదలాయించే ప్రక్రియను జిల్లా యంత్రాం గం చేపడుతోంది. ఇందులో ఇదివరకే కొంత భూమిని హెచ్‌ఎండీఏకు కేటాయించినందున.. దాన్ని కూడా వెనక్కి తీసుకొని ఐటీ శాఖకు అప్పగించేందుకు నడుం బిగించింది. మంత్రి కేటీఆర్.. ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌వేర్ సంస్థలు ముందుకొస్తాయని భావించారు. ఈ క్రమంలోనే ఈ భూములను ఐటీ శాఖకు బదలాయించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.