IT parks
-
హైదరాబాద్ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ఐటీ రంగంలో వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ తరహాలో నగర శివార్లలో కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తాం. వీటి ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై అధికారులు అధ్యయనం చేస్తారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. నగరంలోని నలుమూలల నుంచి ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తాం. ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తాం’అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘పెట్టుబడులతో ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటివరకు ప్రత్యేక పాలసీ లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించి పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తాం. హైదరాబాద్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తాం’అని శ్రీధర్‌బాబు వివరించారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, ‘డ్యూ’వెంచర్స్ ప్రెసిడెంట్ సురేశ్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘అలెరియా ఏఐ’తో పన్నుల రాబడిలో పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా ‘అలెరియా ఏఐ’టెక్నాలజీ దోహదపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలెరియా ఏఐ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి ఎదుట ‘అలెరియా ఏఐ’సాంకేతికతపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ టూల్‌ను ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేస్తే పన్ను, ఆదాయ రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. వివిధ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా అలెరియా ఏఐ సహాయ పడుతుందని వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఐబీటీ సీఈవో మన్సూర్ అలీఖాన్, అలెరియా సీఈవో ఎరిక్ లియాండ్రీ, ఇన్నోలాజిక్ సీఈవో శివ దొండపాటి తదితరులు ఉన్నారు. -
మరో ఏడు ఐటీ పార్కులు!
♦ ఇప్పటికే స్థలాలు ఎంపిక చేసిన యంత్రాంగం ♦ మరో ఐటీ హబ్‌గా మారనున్న బుద్వేల్ ♦ జర్నలిస్టులకు నిర్దేశించిన స్థలం కూడా ఐటీకే ♦ ప్రత్యామ్నాయంగా మియాపూర్ వద్ద కేటాయింపు ♦ ‘ఐటీ’ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యూహం ♦ ఐటీ కంపెనీలు రానున్న ప్రాంతాలు - బుద్వేల్‌లో నం.291 టు 299/పీ వరకు గల 91 ఎకరాలు, సర్వే నం. 282-299 లలోని 164.35 ఎకరాలు, వీడీఓటీ సీ ఆధీనంలో ఉన్న 120 ఎకరాలు - వాలంతరీలోని 252 ఎకరాలు, పుప్పాల్గౌడ సర్వే నం.304-307, 329, 331-339లలోని 100.12 ఎకరాలు - మియాపూర్‌లోని సర్వే నం.28, 29 లోని 160 ఎకరాలు - దుండిగల్‌లోని సర్వే నం.453, 454 లోని భూమి. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలకు ఎర్రతివాచీ పరిచేందుకు ప్రభుత్వం రాజధాని శివార్లలో మరో ఏడు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్న నేపథ్యంలో.. అందుకనువైన వసతులను కల్పించే దిశగా కార్యాచరణ తయారు చేసింది. ఈ మేరకు నగర శివార్లలో ఐటీ పార్కులకు అవసరమైన భూములను గుర్తించింది. నిర్దేశిత ఐటీ పార్కుల జాబితాను కే ంద్ర ప్రభుత్వానికి పంపడం ద్కారా సాఫ్ట్వేర్ కంపెనీలకు ద్వారాలు తెరవాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే ఐటీ హబ్‌గా మారిన గ చ్చిబౌలి, మాదాపూర్ కాకుండా.. ఐటీ పరిశ్రమను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శివార్లలో తొమ్మిది చోట్ల ఐటీ పార్కులను ప్రకటించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఇందులో రెండు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏడింటిని సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇటీవల ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఐటీ పార్కుల అభివృద్ధిపై విస్తృ త చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే బుద్వేల్‌లో పర్యాటక సంస్థకు చెందిన సర్వే నం.291 టు 299/పీ వరకు గల 91 ఎకరాలు, సర్వేనం. 282-299 లలోని 164.35 ఎకరాలను ఐటీ పార్కులకు వినియోగించనున్నారు. అలాగే ఇటీవల జర్నలిస్టుల హౌసింగ్ కాలనీ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని వీడీఓటీ సీ ఆధీనంలో ఉన్న 120 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నా రు. జర్నలిస్టులకు ప్రత్యామ్నాయంగా మియాపూర్‌లో కేటాయించాలని నిర్ణయించారు. అలాగే వాలంతరీ లోని 252 ఎకరాలు, పుప్పాల్గౌడ సర్వే నం.304-307, 329, 331-339లలోని 100.12 ఎకరాల్లో కూడా ఐటీ పార్కు రానుంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నం.28,29లలోని 160 ఎకరాలు, కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని సర్వే నం.453,454లోని భూమిని కూడా ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఈ భూములను ఐటీ శాఖకు బదలాయించే ప్రక్రియను జిల్లా యంత్రాం గం చేపడుతోంది. ఇందులో ఇదివరకే కొంత భూమిని హెచ్ఎండీఏకు కేటాయించినందున.. దాన్ని కూడా వెనక్కి తీసుకొని ఐటీ శాఖకు అప్పగించేందుకు నడుం బిగించింది. మంత్రి కేటీఆర్.. ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్వేర్ సంస్థలు ముందుకొస్తాయని భావించారు. ఈ క్రమంలోనే ఈ భూములను ఐటీ శాఖకు బదలాయించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. -
నగరానికి ‘ఐటీ’హారం!
- హైటెక్‌సిటీ తరహాలో మరో భారీ టవర్ - చిన్న ఐటీ కంపెనీల కోసం నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం - మాదాపూర్ పరిసరాల్లో ఏర్పాటుకు నిర్ణయం.. రాబడుల ఆధారంగా కంపెనీల స్థాయి నిర్ధారణ - కార్పొరేట్ ప్రాంగణాలకు మిన్నగా మౌలిక సదుపాయాల కల్పన - మూలధనం కోసం రుణసాయం అందించేలా చర్యలు.. కొత్తగా మరిన్ని - ఐటీ పార్కుల అభివృద్ధికి సర్కారు నిర్ణయం - ‘ఔటర్’ చుట్టూ ఐటీ కారిడార్ - నూతన ఐటీ విధానంలో ప్రకటించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నగరాన్ని దేశ ఐటీ రాజధానిగా మార్చాలని సంకల్పించుకున్న ప్రభుత్వం... చిన్న ఐటీ కంపెనీలకు ఊతమిచ్చేలా భారీ ఐటీ టవర్లను నిర్మించనుంది. హైటెక్‌సిటీలోని సైబర్ టవర్స్ తరహాలో ఈ భారీ టవర్లను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఐటీ కంపెనీలకు అనువైన ప్రాంతంగా పేరొందిన మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి పరిసరాల్లోనే ఈ కొత్త టవర్లను నిర్మించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారంలో ఆవిష్కరించనున్న నూతన ఐటీ విధానంలో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. చిన్న కంపెనీలకు పెద్దపీట: పెద్ద ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరొందడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ ఈ రంగంలోని ఉద్యోగుల్లో 70 శాతం వరకూ చిన్న, సూక్ష్మ ఐటీ కంపెనీల్లోనే ఉన్నారు. రాష్ట్ర ఐటీ రంగంలోనూ చిన్న ఐటీ కంపెనీల పాత్ర విశేషంగా ఉందని సర్కారు గుర్తించింది. రాష్ట్రంలో దాదాపు 500కు పైగా చిన్న కంపెనీలున్నాయి. ఆ రంగం నుంచి రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో వాటిదే ప్రధాన పాత్ర. అయితే చిన్న ఐటీ కంపెనీలు తమకుండే ఆర్థిక స్తోమతతో సొంత ప్రాంగణాలను సమకూర్చుకోలేకపోతున్నాయి. చాలా వరకు అద్దె/లీజుకు తీసుకున్న భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీ విధానంలో చిన్న కంపెనీలకు చేయూతనిచ్చే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అందులో భాగంగా చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలకు లీజు/అద్దె రాయితీ ప్రకటించనుంది. ప్రత్యేకంగా చిన్న కంపెనీల ఏర్పాటు కోసమే ఐటీ టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. చిన్న కంపెనీలకు ఆఫీసు స్థలం కేటాయించడంతో పాటు కంపెనీల బ్రాండ్‌కు ప్రాచుర్యం పెంపొందించేందుకు ఐటీ టవర్లు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఉన్న కార్పొరేట్ ఐటీ హబ్‌లను తలపించేలా వీటిలో మౌలిక సదుపాయాలను కల్పించనుంది. కంపెనీల సమావేశాలకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్, వైఫై సదుపాయం, కేఫ్ ఇతర మౌలిక వసతులు ఉండేలా డిజైన్ చేయనుంది. రూ.10 కోట్లలోపు టర్నోవర్ ఉంటే.. రూ.50 లక్షలకన్నా ఎక్కువగా-రూ.10 కోట్లలోపు టర్నోవర్ ఉన్న ఐటీ కంపెనీలు, యూనిట్లు, ఎంటర్‌ప్రైజెస్‌ను చిన్న, సూక్ష్మ ఐటీ కంపెనీలుగా పరిగణించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం... తయారీ రంగంలో రూ.5 కోట్లలోపు, సేవారంగంలో రూ.2 కోట్లలోపు పెట్టుబడి పెట్టే కంపెనీలను చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. అయితే ఇతర రంగాలతో పోలిస్తే సాపేక్షంగా ఐటీ రంగంలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల రాబడులను ఆధారంగా చేసుకుని చిన్న, సూక్ష్మతరహా కంపెనీలకు ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని పొందుపరచనుంది. పెట్టుబడికి సాయం.. చిన్న కంపెనీల వృద్ధికి ప్రధాన అవరోధం మూలధనం. కొంతమేర ఆర్థిక సాయం అందిస్తే చిన్న కంపెనీలు సైతం క్రమేణా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసే చర్యలపై కొత్త విధానంలో దృష్టి సారించనుంది. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, రుణ సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌తో చిన్న ఐటీ కంపెనీలకు రుణసాయం అందించేలా సమన్వయం కుదిర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి చిన్న కంపెనీలకు అండగా ఉండేలా ఈ సాయం అందించనుంది. ఔటర్ వెంట ఐటీ కారిడార్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్ పరిసరాల్లోనే ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)లో భాగంగా ఆదిభట్ల, పోచారం ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటు ఆరంభ దశలో ఉంది. వీటితో పాటు ఔటర్ పరిసరాల్లో ఐటీ పార్కులకు అనువైన స్థలాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. వాటిని ప్రత్యేక ఐటీ జోన్లుగా గుర్తించనుంది. వీటితో పాటు టీఎస్ఐఐసీ స్థలాల్లోనూ ఐటీ పార్కులను నెలకొల్పనుంది. ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు పలు రాయితీలు అందించనుంది. వీటితో పాటు ఈసిటీ, మహేశ్వరం సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి రెండు పార్కులను నెలకొల్పనుంది.