విశాఖ ఎయిర్ పోర్ట్ రన్ వే పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.4లక్షల మేర పరిహారం చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రకటించింది. ఉడీ ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్లకు కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాఖ ఎయిర్ పోర్ట్ రన్ వే పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశు సంవర్ధకశాఖలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఓ మంత్రి వెల్లడించారు. బీసీసీఐ సెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన ఎంఎస్కే ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
మంగళగిరిలో 5వేల ఎకరాలలో ఎయిర్ పోర్టు నిర్మించనున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే శిబిరాలకు తరలించినట్టు డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకూ ఐదుగురు మృతిచెందినట్టు ఏపీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది.