బలవంతంగా విరాళాలు సేకరించట్లేదు: చంద్రబాబు | AP Capital Construction: Chandrababu Naidu condemns forceble Collection from students | Sakshi
Sakshi News home page

బలవంతంగా విరాళాలు సేకరించట్లేదు: చంద్రబాబు

Published Thu, Jan 7 2016 6:10 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

బలవంతంగా విరాళాలు సేకరించట్లేదు: చంద్రబాబు - Sakshi

బలవంతంగా విరాళాలు సేకరించట్లేదు: చంద్రబాబు

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి బలవంతంగా విరాళాలు సేకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తిరుపతి ఎస్పీ జేఎన్ఎం హైస్కూలుల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విరాళాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగానే  ప్రజలు, విద్యార్థులు ముందుకు వస్తున్నారన్నారు. కొందరు కావాలనే విరాళాలను వివాదాస్పదం చేసి కోర్టుకు వెళ్లారని చంద్రబాబు ఆరోపించారు.

నా ఇటుక,నా అమరావతి,  నా రాజధాని, అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలనే స్వచ్ఛందంగా విరాళాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా బలవంతంగా విరాళాలు సేకరిస్తున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. మరోవైపు తిరుపతి పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడుతో  ఉన్నత అధికారులు, టీడీపీ నేతలు భేటీ అయ్యారు. తిరుపతి స్మార్ట్ సిటీపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం సెవెన్ హిల్స్ ఆస్పత్రిని చంద్రబాబు ప్రారంభించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement