కాలువల నగరంగా అమరావతి | AP Capital Construction: Chandrababu Naidu condemns forceble Collection from students | Sakshi
Sakshi News home page

కాలువల నగరంగా అమరావతి

Jan 8 2016 3:30 AM | Updated on Aug 18 2018 5:48 PM

కాలువల నగరంగా అమరావతి - Sakshi

కాలువల నగరంగా అమరావతి

అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మహా నగరాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

* బీచ్-కొండల నగరంగా విశాఖ.. సరస్సుల నగరంగా తిరుపతి
* మహా నగరాలుగా మూడు నగరాలు
* తిరుపతి ‘జన్మభూమి-మా ఊరు’లో సీఎం చంద్రబాబు వెల్లడి

సాక్షి, చిత్తూరు: అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మహా నగరాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని అమరావతిని కాలువల నగరంగా, విశాఖపట్నాన్ని బీచ్-కొండల నగరంగా, తిరుపతిని సరస్సుల నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఈ మూడు నగరాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి నీటితో ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. గాలేరు-నగరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చేందుకు త్వరలోనే కోడూరు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సోమశిల-స్వర్ణముఖి పనులను సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు.
 
ప్రజా రాజధానిగా అమరావతి..
క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగకు ఉచితంగా సరుకులు ఇచ్చి అందరిచేత నెయ్యి అన్నం తినిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖ-చెన్నై, బెంగళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, 2029 నాటికి దేశంలోనే నంబర్‌వన్‌రాష్ట్రంగా మారుతుందని, 2050 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని, అందుకే స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరామన్నారు. కొందరు కోర్టుకెళ్లి తాము తప్పుడు పనుల చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement