‘మల్టీనేషనల్’ కనుసన్నల్లో ఏపీ సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పూర్తిగా మల్టీ నేషనల్ కంపెనీల కనుసన్నల్లో నడుస్తోందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) కన్వీనర్, ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదిక నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సహజ వనరుల్ని మల్టీ నేషనల్ కంపెనీలకి ధారాదత్తం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒప్పందాల్లో భాగంగానే ఆంధ్రా-ఒడిశా సరి హద్దులో గ్రీన్‌హంట్ పేరుతో అతిపెద్ద బూటకపు ఎన్‌కౌంటర్‌కి పాల్పడింది.
ఏపీ సీఎం, డీజీపీ చెబుతున్నట్లు ఎన్‌కౌంటర్ నిజమైతే... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలి. ఆదివాసీ ప్రాంతంలోని బాకై ్సట్ నిక్షేపాలు మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టేందు కే వారికి అండగా ఉంటున్న మావోరుుస్టులను హత్య చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్‌స, కేంద్ర రిజర్వ్ బలగాలు, ఒరిస్సా పోలీసులు జరుపుతున్న కూంబింగ్‌ను తక్షణమే నిలిపేయాలి. పోలీసుల అదుపులో మావోరుుస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ)తో పాటు మరో 11 మంది అనుచరులను వెంటనే కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్‌కౌంటర్‌తో కిరాతకంగా 32 మందిని చంపిన పోలీసులపై హత్యా నేరం మోపి శిక్షించాలి’ అని హరగోపాల్ డిమాండ్ చేశారు.
రక్తపుటేరులపై పునర్నిర్మాణమా!
140 కోట్ల బాకై ్సట్ నిక్షేపాలు ఒరిస్సాకు సమీపంలోని ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్నాయని, వాటిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆదివాసీల జీవనం, జీవితం ఆ అరణ్యాల్లోనేనని, అవి లేకుండాపోతే ఆదివాసీలే ఉండరన్నారు. వారికి అండగా ఉంటున్న మావోరుుస్టులను చంపేందుకు సృష్టించిందే గ్రేహౌండ్‌స అన్నారు. అప్పటి ప్రభుత్వం సృష్టించిన నయీమ్ ఉదంతం చూశామన్నారు. ఏవోబీలోకి గ్రేహౌండ్‌స, కేంద్ర రిజర్వ్ బలగాలు వెళ్లి.. మావోరుుస్టులను చంపాయన్నారు. మారణకాండ, రక్తపుటేరుల మీద రాష్ట్ర పునర్నిర్మాణం జరుపుతారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆర్కే ఎక్కడున్నాడు..?
ఆర్కే ఎక్కడున్నాడో వెంటనే తెలపాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు మెదపరెందుకన్నారు. ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడు తూ... 32 మంది మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలు పెట్టి పోలీసులు కాల్చి చంపారన్నారు. మహిళా మావోయిస్టుల శరీరభాగాలు లేవన్నారు. ఓ మహిళా మావోయిస్టు మొండెం మాత్రమే ఉందని, మరికొందరి శరీరంపై కత్తులతో కోసిన గాయాలున్నాయని వారి కుటుంబీకులు తెలిపారన్నారు. గనుల విషయంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అమలు చేయాల్సి ఉన్నా... దాన్ని పట్టించుకోవటం లేదన్నారు.
కొండల కింద బాకై ్సట్ ఉంటేనే నీళ్లుంటాయన్నారు. నీళ్లు లేకపోతే ఆదివాసీల జీవితమే ఉండదని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు పి.సంధ్య చెప్పారు. 2 రాష్ట్రాల్లోని ప్రజాస్వామిక వాదులు ఎన్‌కౌంటర్‌పై నోరువిప్పి, ఆదివాసీల వెంట నడవాలని పిలుపునిచ్చారు. టీడీఎఫ్ నేత చిక్కు డు ప్రభాకర్ మాట్లాడుతూ నవంబర్ 5న ఈ ఎన్‌కౌంటర్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ వినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు, ప్రజలు ఇందులో పాల్గొనాలని కోరారు. టీడీఎఫ్ నాయకులు డప్పు రమేష్, పీడీఎం రాజు, బండి దుర్గాప్రసాద్, కోఠి, జ్యోతి, విరసం గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
మృతదేహాలపై గాయాలు
‘స్నేహితురాలు భారతి బంధువుల కోసం వెళ్తే, నా సహచరుడు కూడా ఉన్నాడని తెలిసింది. ఎన్‌కౌంటర్ జరిగి రెండు రోజులైనా ఫొటో విడుదల చేయలేదు. మృతదేహాలన్నింటిపై గాయాలున్నాయి. కొన్ని మృతదేహాల నుంచి పేగులు, ఇతర అవయవాలు బయటకు వచ్చాయి. నా భర్త ప్రభాకర్ ఇంజనీర్. ఆదివాసీల బాగు కోసమే ఉద్యమ బాటపట్టారు’ అని ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ప్రభాకర్ భార్య దేవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.