ఎనిమిది మంది వైద్యుల నియామకం
Published Tue, Aug 23 2016 12:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:38 PM
ఎంజీఎం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 16 మంది వైద్యాధికారుల పోస్టుల భర్తీ ప్రకియలో భాగంగా సోమవారం డీ ఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది వైద్యులను నియమించామని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో మెరి ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన 16 మందిని కౌన్సెలింగ్‌కు పిలవగా ఎనిమిది మందే హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ మేర కు వారికి చుంచుపల్లి, పస్రా, రొయ్యూరు, కొత్తగూడ, గోవిందరావుపేట, నల్లబెల్లి, మడపల్లి, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అప్పయ్య, సూపరింటెండెంట్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement