వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబంపై దాడి | attacked on ysrcp activist family | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబంపై దాడి

Published Wed, Feb 1 2017 10:40 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబంపై దాడి - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబంపై దాడి

ధర్మవరం అర్బన్ : ధర్మవరంలోని గూడ్స్‌షెడ్‌ కొట్టాలలో నివాసముంటున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త అన్వర్‌బాషా, అతని తల్లి దిల్షాద్‌బీ, భార్య నజ్మలపై స్టోర్‌ డీలర్‌ సోమశేఖర్‌, టీడీపీ నాయకులు నరేష్, లింగమయ్య, ఉప్పర గంగన్న, ముత్యాలు, మంజు, హరీష్, గంగాద్రి, రామాంజనేయులు, ముస్తఫా తదితరులు ఇటుకలు, కట్టెలతో దాడి చేశారు.

తీవ్రగాయాలపాలైన అన్వర్‌బాషా, దిల్షాద్‌బీలను బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్వర్‌బాషా తమ్ముడు మహబూబ్‌బాషాతో టీడీపీ నాయకులు వడలు తెప్పించుకున్నారు. ఈ విషయం తెలిసి మహబూబ్‌బాషాను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహించి అన్వర్‌బాషా కుటుంబంపై దాడి చేశారు. ఈ మేరకు బాధితులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement