బ్యాంక్ దోపిడీకి యత్నం.. గాల్లోకి కాల్పులు | attempt to bank robbery, robbers fired into air | Sakshi
Sakshi News home page

బ్యాంక్ దోపిడీకి యత్నం.. గాల్లోకి కాల్పులు

Published Wed, Jul 20 2016 12:52 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

బ్యాంక్ దోపిడీకి యత్నం.. గాల్లోకి కాల్పులు - Sakshi

బ్యాంక్ దోపిడీకి యత్నం.. గాల్లోకి కాల్పులు

బ్యాంక్ దోపిడీకి యత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటపడి తరమడంతో.. దుండగులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

మొయినాబాద్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ అజీజ్నగర్ బ్రాంచిలో కొందరు దుండగులు చోరీకి ప్రయత్నించారు. రాత్రి ఒంటి గంటల సమయంలో తాళాలు పగలగొడుతున్న సమయంలో ఇద్దరు యువకులు వారిని ప్రశ్నించగా.. అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా.. దుండగులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణకు రెండు బృందాలను నియమించారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల పనా మరెవరైనానా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో దొంగలు అసలు ఎటు పారిపోయారో తెలుసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement