సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌పాషా తెలిపారు. ఆదివారం స్థానిక ఐబీలో నిర్వహించిన ఆటో యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. బంద్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బంద్ సందర్భంగా సంగారెడ్డి గంజ్ మైదాన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామన్నారు.