auto strike
-
రేపు నగరంలో ఆటోలు బంద్
హైదరాబాద్: శుక్రవారం నగరంలో ఆటోలు రోడెక్కవు. భారీగా పెరిగిన బీమా, రవాణా ఫీజులను తగ్గించాలని, ఓలా, ఊబర్ సంస్థలను నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఆటో, వ్యాన్లు, ట్రాలీల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. బంద్‌తో పాటు పెద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్టర్లను గురువారం హిమాయత్‌నగర్‌లోని ఎఐటీయూసీ భవన్లో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ఆటో ప్రదర్శనను నిర్వహిస్తామన్నారు. పెరిగిన రవాణా ఫీజులతో ఏడాదికి రూ.వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్
సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాహెర్పాషా తెలిపారు. ఆదివారం స్థానిక ఐబీలో నిర్వహించిన ఆటో యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. బంద్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బంద్ సందర్భంగా సంగారెడ్డి గంజ్ మైదాన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామన్నారు. -
ఆటో సమ్మె వాయిదా
- స్పెషల్ డ్రైవ్ నిలిపివేతకు ఆర్టీఏ అధికారుల అంగీకారం - ఆటో సంఘాలతో చర్చలు సఫలం - డ్రైవింగ్ లెసైన్సులకు నెల గడువు సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ, పోలీసుల స్పెషల్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక బంద్‌ను ఆటో సంఘాల జేఏసీ వాయిదా వేసుకుంది. ఆటో సంఘాల ప్రతినిధులతో రవాణా, పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం రెండు విడతలుగా జరిపిన చర్చలు సఫలం కావడం, స్పెషల్ డ్రైవ్ నిలిపివేసేందుకు అధికారులు అంగీకరించడంతో సమ్మె ప్రతిపాదనను వాయిదా వేసుకుంటున్నట్లు ఆటో సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం, వి.కిరణ్, మారయ్య, సత్తిరెడ్డిలు తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 16 నుంచి జప్తు చేసిన ఆటోలను తిరిగి డ్రైవర్లకు అప్పగించేందుకు కూడా రవాణాశాఖ అంగీకరించినట్లు పేర్కొన్నారు. రవాణాశాఖ అదనపు కమిషనర్ బి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, డీసీపీ (ట్రాఫిక్) రంగనాథ్, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ ఆటో సంఘాలతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగియడంతో నగరంలోని లక్షా 30 వేల ఆటోలు యథావిధిగా సాగనున్నాయి. లెసైన్సు లేకుండా ఆటోలు నడిపితే పర్మిట్లు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఆటోడ్రైవర్లు డ్రైవింగ్ లెసైన్సు తీసుకునేందుకు నెల రోజుల గడువు విధించారు. అలాగే లెసైన్సులు లేవనే కారణంగా ఆటోలను జప్తు చేయడం, పర్మిట్లను రద్దు చేయడం వంటి చర్యలు మాత్రం ఉండబోవు. రవాణా, పోలీసు అధికారులతో జరిగిన చర్చల్లో 15 ఆటో సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర జిల్లాల ఆటోలపై కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర పొరుగు జిల్లాల నుంచి వచ్చి నగరంలో తిరిగే ఆటోరిక్షాలపైన మాత్రం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని జేటీసీ రఘునాథ్ తెలిపారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, సంగారెడ్డి, షాద్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ఆటోలను నగరానికి తరలిస్తున్నందువల్ల వాటిని నియంత్రించేందుకు డ్రైవ్ కొనసాగుతుందన్నారు. డ్రైవింగ్ లెసైన్సులు తీసుకొనేందుకు నెల రోజుల గడువు విధించిన నేపథ్యంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి లెర్నింగ్ లెసైన్సులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఆగిన ఆటో
-
ఆగిన ఆటో
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆటో రిక్షాకు బ్రేకులు పడ్డాయి. ఆటోసంఘాల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సుమారు లక్షా 20 వేల ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు వెంకటేశం, నరేందర్, సత్తిరెడ్డి, కిరణ్ స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనందున తమ ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు వారు తెలిపారు. సమ్మెకు దూరం బీఎంఎస్, ఆటోసంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ తదితర సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మె అర్థరహితమని ఆ సంఘాలు పేర్కొన్నాయి.