రేపు నగరంలో ఆటోలు బంద్
రేపు నగరంలో ఆటోలు బంద్
Published Thu, Apr 6 2017 5:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: శుక్రవారం నగరంలో ఆటోలు రోడెక్కవు. భారీగా పెరిగిన బీమా, రవాణా ఫీజులను తగ్గించాలని, ఓలా, ఊబర్ సంస్థలను నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఆటో, వ్యాన్లు, ట్రాలీల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. బంద్‌తో పాటు పెద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొంది.
దీనికి సంబంధించిన పోస్టర్‌లను గురువారం హిమాయత్‌నగర్‌లోని ఎఐటీయూసీ భవన్‌లో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ఆటో ప్రదర్శనను నిర్వహిస్తామన్నారు. పెరిగిన రవాణా ఫీజులతో ఏడాదికి రూ.వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement