సాక్షి, హైదరాబాద్: ఫైనాన్సర్ల వేధింపులు, క్యాబ్ డ్రైవర్‌ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నెల 23న(సోమవారం) ఉబర్, ఓలా క్యాబ్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షన్నర కార్లు ఈ రెండు సంస్థల్లో తిరుగుతున్నాయని, రూ.లక్షలు అప్పులు తెచ్చి కార్లు కొనుక్కున్న ఎంతోమందికి కనీస ఉపాధి లభించడం లేదన్నారు. ఫైనాన్సర్ల వద్ద వాయిదాలు చెల్లించలేక, వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోందన్నారు.
ఉబర్, ఓలాలో అనారోగ్యకరమైన పోటీ వాతావరణం కారణంగానే డ్రైవర్‌లు ఉపాధిని కోల్పోతున్నట్లు తెలిపారు. పలుమార్లు తాము ఆందోళన చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment